భార్యతో కలిసి ఓటేసిన పవన్ కల్యాణ్.. పోతిన మహేశ్ పై నెటిజెన్ల విమర్శలు

  • మంగళగిరిలో భార్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న పవన్
  • పవన్ భార్యను ఉద్దేశించి గతంలో పోతిన మహేశ్ అనుచిత వ్యాఖ్యలు
  • భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు కళ్లు తెరిచి చూడు అంటూ నెటిజెన్ల సైటైర్లు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కు వెళ్లారు. పోలింగ్ బూత్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. 

మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్... పవన్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ వేల కోట్లు సంపాదించారని... పవన్ బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయటపెడతానని కూడా అన్నారు. మూడో భార్య అన్నా లెజినోవా మీతోనే కలిసి ఉంటే పిఠాపురంలో కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీసమేతంగా రావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోతినపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 'భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు... కాస్త కళ్లు తెరిచి చూడు పోతిన మహేశ్' అని ఎద్దేవా చేస్తున్నారు. 

మరోవైపు ఏపీలో పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నుంచి కూడా లక్షల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏపీలోని సొంత ఊళ్లకు వెళ్లారు. దీంతో, గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అధికారులు చెపుతున్నారు.

Pawan Kalyan
janasena
Pothina Mahesh
YSRCP

More Telugu News